.------------------------------------------------------------ - జుజ్జూరి వేణు
రెడీ... స్టార్ట్... యాక్షన్... అన్న పదాలు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి, కలలో కూడా. సినిమా నా రంగుల కలల ప్రపంచం. దాన్ని చేరాలంటే రచనలనే వారధుల మీద మాత్రమే సాధ్యం.
నా రచనా ప్రపంచం అదో స్వాప్నిక లోకం. ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా నేను సృష్టించుకున్న పాత్రలు, నేను మాత్రమే ఉండే ఊహాలోకం.
పైరసీ వీడియో షాపు కాంతారావు దగ్గర రోజూ కూర్చొని సినిమాల్ని విశ్లేషించి, విమర్శిస్తూ, ప్రశంసిస్తూ గడిపేసేవాణ్ని. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే పిచ్చి నాకు. ఒక రోజాయన ఒక డీవీడీ ఇచ్చారు. వాటిమీద రెండు థ్రిల్లర్ సినిమాల పేర్లున్నాయి. వాటిని చూసి అభిప్రాయాలు చెప్పమన్నారాయన. అందులో మొదటిదైన ‘డైరీ’ సినిమా చూస్తున్నాను. యండమూరి వీరేంద్రనాథ్ ఒక డైరీలో రాసుకున్న కథని హీరో చదువుతూ, అదో యథార్థ గాథ అనుకుని, దెయ్యమనుకుని ఒక అమ్మాయిని హత్య చేసేస్తాడు.
సినిమా క్లైమాక్స్‌లో యండమూరి వచ్చి, ‘దెయ్యాలన్నీ మన భయాలు, భ్రమలు’ అని చెప్పి, సైకలాజికల్ ఫీలింగ్ అయిన హాల్యూసినేషన్ (ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు భ్రమించడం) గురించి చెప్పడంతో, కథ ముగుస్తుంది. సినిమానంతా పూర్తి అలౌకిక స్థితిలో ఉండి చూశాను. గది తలుపులన్నీ మూసేసి 29॥కలర్ టీవీలో అతి దగ్గర్నుండి చూస్తూ, నా ముందే పాత్రలున్నట్టు ఊహించుకుంటూ పాత్రల భావోద్వేగాలు, స్వభావాలు, వాటి చుట్టూ ఉన్న పరిస్థితుల్ని ఇమాజిన్ చేసుకోవడం నాకు అలవాటు. తరువాత సినిమా ప్లే చేశాను. టైటిల్స్ పడేటప్పుడు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాను. డీవీడీ మీద పేరుని చూశాను.
‘డైరీ’ తరువాత సినిమా ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’. కానీ వేరే సినిమా టైటిల్స్ పడుతున్నాయి. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. అంతలోనే నా హాల్యూసినేషన్ (భ్రాంతి) స్థితికి నాకే నవ్వొచ్చింది. అది ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’ సినిమానే. మళ్లీ అంతలోనే, కాదు కాదు ఆ సినిమా కాదనిపిస్తోంది. పిచ్చెక్కిపోతోంది నాకు. రెండు చేతుల్తో తల పట్టుకుని చీకట్లో నిశ్శబ్దంగా తిరుగుతున్న ఫ్యాన్‌ని చూశాను.
వెంటనే నా ఫ్రెండ్‌కు ఫోన్‌చేసి పిలిపించి, ‘‘ఇది ‘ఎ ఫిల్మ్ బై అరవిందే’ కదూ?’’ అని ప్రశ్నించాను. అతను నావైపు ఓ పిచ్చివాణ్ని చూసినట్టు చూసి, ‘‘కాదు. ‘అనసూయ’’ అన్నాడు.
జరిగిన హాల్యూసినేషన్ సీన్‌ను పైరసీ కాంతారావుకి చెప్పాను. ఆయన ఊపిరి గాఢంగా పీల్చి, ‘‘అది హాల్యూసినేషన్ కాదు, పవర్‌ఫుల్ ఇమాజినేషన్’’ అన్నాడు. నేను ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఆయన చెప్పింది నిజమని, ఆయనకంటే ముందే నా రచయిత బుర్ర ఊహించింది. ‘‘ఇలాంటివి 10 డీవీడీలు తెప్పించి, నీలాంటి 10 కస్టమర్లకు ఇచ్చాను. వాళ్లంతా నాదగ్గరకొచ్చి, నీలా సినిమాల్ని విశ్లేషించేవారే.
నిజానికి మీ 10 మందికి ఆ అర్హత ఉందా లేదా అని తెలుసుకోవడానికి నేను చేసిన ప్రయత్నమే ఇది’’ అన్నాడు. నేను ఊహించనిదిది. ‘‘సినిమాని విశ్లేషణ చేసి విమర్శించాలన్నా, ప్రశంసించాలన్నా ఉండాల్సిన అర్హత పవర్‌ఫుల్ ఇమాజినేషన్. బాహ్య ప్రపంచాన్ని మరచి చూస్తున్న సినీలోకంలోకి వెళ్లి, విశేషానుభవంతో పాత్రల స్వభావాలను, పరిస్థితులను, కథాకథనాల్ని పరిశీలించి మాత్రమే నిజానిజాలు వెల్లడించాలి.
అంతేగానీ, నోటికి ఏదొస్తే అది వాగడం కాదు. మిగిలిన 9 మంది డీవీడీలో 2వ సినిమా మారిందని చెప్పారే గాని, ‘డైరీ’ సినిమాలో లీనమై 2వ సినిమా విషయంలో కన్‌ఫ్యూజ్ అయ్యామని చెప్పలేదు. అంటే, వాళ్లందరూ సినిమాని ఏ ఎమోషన్ లేకుండా, కనీసం కొద్దిగా కూడా ఇమాజినేషన్ లేకుండా చూసేశారు. కానీ, నువ్వు మాత్రం పవర్‌ఫుల్ ఇమాజినేషన్‌తో చూశావు. కాబట్టి విశ్లేషించి విమర్శించడానికైనా, ప్రశంసించడానికైనా నీకు మాత్రమే హక్కు ఉంది.
‘‘గొప్పగా ఊహించేవాడు, గొప్పగా బతకగలడు’’ అని కూడా అన్నాడాయన. గొప్పగా బతకడమంటే అన్నాన్నేను. ‘‘సాధించిన దానితో సంతృప్తి పడకపోవడం’’ అన్నారాయన. ఒక్కసారిగా నా మైండ్ బ్లాంక్ అయ్యి, చిన్నప్పటి నుండి నేను నేర్చుకున్న విషయాలన్నీ మరిచి, ఆలోచనంతా ఆ వాక్యం చుట్టూ తిరుగుతూ ఉండిపోయింది. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత, ఫన్‌డేలో రామ్‌గోపాల్ వర్మని ఒకతను ఇలా అడిగాడు.
‘‘మిమ్మల్ని చాలా భయపెట్టిన సినిమా ఎగ్జారిస్ట్ అన్నారు. అందులో అంతగా భయపడే సన్నివేశాలేమీ లేవే?’’ అందుకాయన సమాధానంగా ‘‘భయపడటానికి ఇమాజినేషన్ ఉండాలి. అది మీకు లేదు’’ అని బదులిచ్చారు.
- జుజ్జూరి వేణు
నా రచనా ప్రపంచం అదో స్వాప్నిక లోకం. ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా నేను సృష్టించుకున్న పాత్రలు, నేను మాత్రమే ఉండే ఊహాలోకం.
పైరసీ వీడియో షాపు కాంతారావు దగ్గర రోజూ కూర్చొని సినిమాల్ని విశ్లేషించి, విమర్శిస్తూ, ప్రశంసిస్తూ గడిపేసేవాణ్ని. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలంటే పిచ్చి నాకు. ఒక రోజాయన ఒక డీవీడీ ఇచ్చారు. వాటిమీద రెండు థ్రిల్లర్ సినిమాల పేర్లున్నాయి. వాటిని చూసి అభిప్రాయాలు చెప్పమన్నారాయన. అందులో మొదటిదైన ‘డైరీ’ సినిమా చూస్తున్నాను. యండమూరి వీరేంద్రనాథ్ ఒక డైరీలో రాసుకున్న కథని హీరో చదువుతూ, అదో యథార్థ గాథ అనుకుని, దెయ్యమనుకుని ఒక అమ్మాయిని హత్య చేసేస్తాడు.
‘డైరీ’ తరువాత సినిమా ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’. కానీ వేరే సినిమా టైటిల్స్ పడుతున్నాయి. నా కళ్లను నేనే నమ్మలేకపోయాను. అంతలోనే నా హాల్యూసినేషన్ (భ్రాంతి) స్థితికి నాకే నవ్వొచ్చింది. అది ‘ఎ ఫిల్మ్ బై అరవింద్’ సినిమానే. మళ్లీ అంతలోనే, కాదు కాదు ఆ సినిమా కాదనిపిస్తోంది. పిచ్చెక్కిపోతోంది నాకు. రెండు చేతుల్తో తల పట్టుకుని చీకట్లో నిశ్శబ్దంగా తిరుగుతున్న ఫ్యాన్‌ని చూశాను.
వెంటనే నా ఫ్రెండ్‌కు ఫోన్‌చేసి పిలిపించి, ‘‘ఇది ‘ఎ ఫిల్మ్ బై అరవిందే’ కదూ?’’ అని ప్రశ్నించాను. అతను నావైపు ఓ పిచ్చివాణ్ని చూసినట్టు చూసి, ‘‘కాదు. ‘అనసూయ’’ అన్నాడు.
జరిగిన హాల్యూసినేషన్ సీన్‌ను పైరసీ కాంతారావుకి చెప్పాను. ఆయన ఊపిరి గాఢంగా పీల్చి, ‘‘అది హాల్యూసినేషన్ కాదు, పవర్‌ఫుల్ ఇమాజినేషన్’’ అన్నాడు. నేను ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే ఆయన చెప్పింది నిజమని, ఆయనకంటే ముందే నా రచయిత బుర్ర ఊహించింది. ‘‘ఇలాంటివి 10 డీవీడీలు తెప్పించి, నీలాంటి 10 కస్టమర్లకు ఇచ్చాను. వాళ్లంతా నాదగ్గరకొచ్చి, నీలా సినిమాల్ని విశ్లేషించేవారే.
నిజానికి మీ 10 మందికి ఆ అర్హత ఉందా లేదా అని తెలుసుకోవడానికి నేను చేసిన ప్రయత్నమే ఇది’’ అన్నాడు. నేను ఊహించనిదిది. ‘‘సినిమాని విశ్లేషణ చేసి విమర్శించాలన్నా, ప్రశంసించాలన్నా ఉండాల్సిన అర్హత పవర్‌ఫుల్ ఇమాజినేషన్. బాహ్య ప్రపంచాన్ని మరచి చూస్తున్న సినీలోకంలోకి వెళ్లి, విశేషానుభవంతో పాత్రల స్వభావాలను, పరిస్థితులను, కథాకథనాల్ని పరిశీలించి మాత్రమే నిజానిజాలు వెల్లడించాలి.
అంతేగానీ, నోటికి ఏదొస్తే అది వాగడం కాదు. మిగిలిన 9 మంది డీవీడీలో 2వ సినిమా మారిందని చెప్పారే గాని, ‘డైరీ’ సినిమాలో లీనమై 2వ సినిమా విషయంలో కన్‌ఫ్యూజ్ అయ్యామని చెప్పలేదు. అంటే, వాళ్లందరూ సినిమాని ఏ ఎమోషన్ లేకుండా, కనీసం కొద్దిగా కూడా ఇమాజినేషన్ లేకుండా చూసేశారు. కానీ, నువ్వు మాత్రం పవర్‌ఫుల్ ఇమాజినేషన్‌తో చూశావు. కాబట్టి విశ్లేషించి విమర్శించడానికైనా, ప్రశంసించడానికైనా నీకు మాత్రమే హక్కు ఉంది.
‘‘గొప్పగా ఊహించేవాడు, గొప్పగా బతకగలడు’’ అని కూడా అన్నాడాయన. గొప్పగా బతకడమంటే అన్నాన్నేను. ‘‘సాధించిన దానితో సంతృప్తి పడకపోవడం’’ అన్నారాయన. ఒక్కసారిగా నా మైండ్ బ్లాంక్ అయ్యి, చిన్నప్పటి నుండి నేను నేర్చుకున్న విషయాలన్నీ మరిచి, ఆలోచనంతా ఆ వాక్యం చుట్టూ తిరుగుతూ ఉండిపోయింది. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత, ఫన్‌డేలో రామ్‌గోపాల్ వర్మని ఒకతను ఇలా అడిగాడు.
‘‘మిమ్మల్ని చాలా భయపెట్టిన సినిమా ఎగ్జారిస్ట్ అన్నారు. అందులో అంతగా భయపడే సన్నివేశాలేమీ లేవే?’’ అందుకాయన సమాధానంగా ‘‘భయపడటానికి ఇమాజినేషన్ ఉండాలి. అది మీకు లేదు’’ అని బదులిచ్చారు.
- జుజ్జూరి వేణు
30/01/2011
ఆదివారం అనుబందం నుండి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి